కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్!
- కేరళ సీఎం రేసులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
- ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఖర్గేకు పంపిన పరిశీలకులు
- సతీశన్, చెన్నితాల కూడా పోటీలోనే
- సోమవారం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం?
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. సీఎం పదవి కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నప్పటికీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన సీఎం రేసులో అందరికంటే ముందున్నారని కాంగ్రెస్ వర్గాలు ఎన్డీటీవీకి తెలిపాయి.
కేరళలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ సమావేశమై వారి అభిప్రాయాలు స్వీకరించారు. అనంతరం శుక్రవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తమ నివేదికను సమర్పించారు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు వేణుగోపాల్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ గెలుపునకు 'నిజమైన సూత్రధారి' వేణుగోపాల్ అని అభివర్ణిస్తూ కార్యకర్తలు 'నాయకన్' (హీరో) పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు.
సీఎం రేసులో ప్రస్తుత ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, సీనియర్ నేత రమేశ్ చెన్నితాల పేర్లు కూడా ఉన్నప్పటికీ, పార్టీ అధిష్ఠానం వేణుగోపాల్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమి 102 సీట్లు గెలుచుకుంది. ఇందులో కాంగ్రెస్ 63, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 22, కేరళ కాంగ్రెస్ 7 స్థానాలు సాధించాయి. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కేవలం 35 సీట్లకే పరిమితమైంది.
అధిష్ఠానం పిలుపు మేరకు ముగ్గురు ప్రధాన నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రిగా ఎంపికైతే, ప్రస్తుతం ఆలప్పుళ లోక్‌సభ ఎంపీగా ఉన్న వేణుగోపాల్ తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగే అవకాశం ఉండగా, ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరుకావచ్చని భావిస్తున్నారు.